ETV Bharat / jagte-raho

వికారాబాద్​లో పంతొమ్మిదేళ్ల యువతి అపహరణ - వికారాబాద్​లో యువతి అపహరణ

young girl kidnapped in vikarabad
వికారాబాద్​లో పంతొమ్మిదేళ్ల యువతి అపహరణ
author img

By

Published : Sep 27, 2020, 7:48 PM IST

Updated : Sep 27, 2020, 11:49 PM IST

19:45 September 27

వికారాబాద్​లో పంతొమ్మిదేళ్ల యువతి అపహరణ

అందరూ చూస్తుండగానే యువతిని అపహరించిన ఘటన... వికారాబాద్​ ఎంఆర్​పీ చౌరస్తాలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన దీపిక, అఖిల్​... 2016లో ఆర్యసమాజ్​లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం దీపిక తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం వల్ల రెండు సంవత్సరాల క్రితం ఇంటికి తీసుకొచ్చారు. అందులో భాగంగానే శనివారం నాడు ఇద్దరూ వికారాబాద్​ కోర్టుకు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం సోదరితో కలిసి షాపింగ్​కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా... భర్త, మరో ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి లాక్కొని వెళ్లినట్టు స్థానికంగా ఓ వ్యాపారస్థుడు తెలిపాడు. 

దీపిక కుటుంబసభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ సంజీవరావు సిబ్బందితో ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ ముమ్మరం చేశారు. ఘటన జరిగిన పరిసరాల్లోని దుకాణాల్లో ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.  పూర్తి వివరాలు వెల్లడించడానినికి పోలీసులు, కుటుంబసభ్యులు నిరాకరిస్తున్నారు. 

Last Updated : Sep 27, 2020, 11:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.