ETV Bharat / jagte-raho

అప్పులు తీర్చలేక  యువరైతు ఆత్మహత్య - తీగుల్​లో యువరైతు ఆత్మహత్య

మూడేళ్లు అనావృష్టి ...ఈ ఏడు అతివృష్టి వల్ల పంట చేతికందక ఆ రైతుకు ఏం చేయాలో పాలుపోలేదు. పంటసాగుకు, కుటుంబ పోషణకు చేసిన అప్పులు తీర్చే మార్గం తోచక మరణమే శరణ్యమనుకుని యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా తీగుల్​లో చోటుచేసుకుంది.

young farmer suicide at teegul village in siddipet district
అప్పులు తీర్చలేక ఓ యువరైతు ఆత్మహత్య
author img

By

Published : Sep 8, 2020, 10:58 PM IST

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన బీడ కనకయ్య (38) అనే రైతు తనకున్న ఎకరం పొలంతో పాటు అదే గ్రామానికి చెందిన మరో రైతు వద్ద ఆరు ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నాడు. గడిచిన మూడేళ్లుగా సరైన పంటలు పండక పోవడం.. ఈ ఏడు అతివృష్టి వల్ల వేసిన పంటలు పాడవడమూ జరిగింది. కాగా కౌలుకు తీసుకున్న ఆరు ఎకరాలకు.. ఎకరాకు రూ. 12,000 చొప్పున సంవత్సరానికి రూ.72,000 చెల్లించాల్సి ఉంటుంది. పంటల సాగుకు కుటుంబ పోషణకు చేసిన అప్పులు మూడు లక్షల వరకు చేరుకున్నాయి.

ఈ అప్పులు తీర్చే మార్గం తోచక వారం రోజులుగా దిగాలుగా తిరుగుతున్న కనకయ్య.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు గజ్వేల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే రైతు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జగదేవపూర్ పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.