ETV Bharat / jagte-raho

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అక్రమాల మకిలీ - యాదాద్రిలో ఒకే రసీదుతో పలువురికి ఈసీలు

ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. ముఖ్యంగా రైతుల్ని ఇబ్బందులకు గురిచేయడంలో కొందరు ముందుటున్నారు. తాజాగా యాదగిరిగుట్ట సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయంలో ఓ అధికారిని నిర్వాకం ఎనిమిది మంది రైతుల్ని ఇబ్బందులకు గురిచేసింది. ఒకే సంఖ్య క్యాష్‌ రిసిప్ట్‌తో అనేక రైతులకు ఈసీలు అందజేశారు. రూ.220 రుసుము ఉండగా... ఆ ఉద్యోగి మాత్రం రూ.400 వరకు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారిణి నిర్వాకం..  ఒకే రసీదుతో పలువురికి ఈసీలు

author img

By

Published : Jun 6, 2020, 4:39 PM IST

యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి అక్రమాల మకిలీ తొలగిపోవడం లేదు. గతేడాది ఏసీబీ అధికారుల తనిఖీల్లో ఉద్యోగులు అడ్డంగా దొరికి బదిలీ అయ్యారు. తాజాగా ఒకే సంఖ్య(2296) నగదు రసీదుతో అనేక మందికి ఈసీలు అందజేసిన అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. పంట రుణాల కోసం దరఖాస్తు చేసుకొనే రైతులకు వ్యవసాయ భూములకు సంబంధించిన ఈసీలు అవసరం.

బ్యాంకు అధికారులు గుర్తించి..

యాదగిరిగుట్ట పీఏసీఎస్‌లో పరిధిలోని రైతులు స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ పనిచేస్తున్న ఓ ఉద్యోగిని ఒకే సంఖ్య క్యాష్‌ రిసిప్ట్‌తో అనేక ఈసీలు అందజేశారు. బ్యాంకు అధికారులు గుర్తించి కొన్ని దస్త్రాలను వెనక్కి పంపడంతో పీఏసీఎస్‌ ఛైర్మన్‌ రాంచంద్రారెడ్డి శుక్రవారం సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌కు ఫిర్యాదు చేశారు. పలు ఈసీలను ఒకే సంఖ్య ఉన్న క్యాష్‌ రిసిప్టుతో జారీ చేసినట్లు గుర్తించామని, ఆ మహిళా ఉద్యోగిపై చర్యల నిమిత్తం జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేస్తామని సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌ తెలిపారు. చాలా మందికి ఇలా ఈసీ అందించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

దొంగ ఈసీలు, దొంగ రిజిస్ట్రార్​ నెంబర్ల మీద రిజిస్ట్రార్​కు కంప్లెంట్​ ఇస్తే సరిగ్గా స్పందిచనే లేదు. జిల్లా రిజిస్ట్రార్‌కు విషయాన్ని తెలియజేస్తాగాని నేనేం చేస్తా? అని నిర్లక్ష్య ధోరణితో సమాధానమిస్తున్నరు. సంబంధిత ఉద్యోగిని పిలిపించి దీనిపై వివరణ కోరమన్నా.. పట్టించుకోవడం లేదు. ఈ ఆఫీస్ల్​లో లంచాలు ఇస్తేనే పనులు చేస్తారు. చేతిలో రూపాయి పెట్టకుండా పనిచేసే పరిస్థితి లేదు. భూముల రేట్లు పెరిగే సరికి రోజుకు లక్షలు లక్షలు దోచుకుంటున్నారు. నిజంగా సర్వీస్​ చేయడం మాత్రం ఈ ఆఫీస్​లో జరగడం లేదు. ఒక్కొక్క ఈసీకి రూ.400 లంచం అడుగుతున్నారు. లేకుంటే ఒక వారం తిప్పించుకుని ఈసీలు ఇస్తున్నరు. చాలా దారుణంగా ఉంది యాదగిరిగుట్ట రిజిస్ట్రార్​ ఆఫీస్​ పరిస్థితి. - రాంచంద్రారెడ్డి, పీఏసీఎస్‌ ఛైర్మన్‌

యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

మూడ్రోజులు తిప్పించుకుంటారు..

రూ.220 రుసుము ఉండగా... ఆ ఉద్యోగి మాత్రం రూ.400 వరకు వసూలు చేశారని, ప్రశ్నించే వారిని రెండు, మూడు రోజులు తిప్పించుకొన్నారని బాధిత రైతులు వాపోయారు. ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ ఉద్యోగిని అనారోగ్య కారణాలతో శుక్రవారం మధ్యాహ్నమే విధుల నుంచి ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిసింది.

ఇవీ చూడండి: ఐదు రోజులు... ఆరు హత్యలు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.