నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయం ఆవరణలో సల్కరిపేట గ్రామానికి చెందిన మహిళలు ధర్నా చేపట్టారు. తమకు తెలియకుండా తమ పేరుపై కొందరు వెలుగు ఆఫీస్ సిబ్బంది అక్రమంగా రుణాలు తీసుకొని మోసగించారని ఆరోపిస్తూ కార్యాలయం ఆవరణలో బైఠాయించారు.
అక్రమంగా రుణాలు పొంది మోసగించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్షర జ్ఞానం లేని తమను మోసగించడం పట్ల మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గంట పాటు కార్యాలయం ఆవరణలో బైఠాయించి కార్యాలయ పనులను స్తంభింపజేశారు.
స్పందించిన అధికారులు ఈ విషయంపై విచారణ జరిపించి.. బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫలితంగా మహిళలు ఆందోళన విరమించారు.
ఇదీచూడండి.. జడ్పీ ఛైర్మన్‌కు ఏఐకేఎంఎస్ నాయకుల వినతిపత్రం