సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లుకు చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గ్రామానికి చెందిన అమరబోయిన రామారావుకి సర్వే నంబర్ 342లో ఐదు ఎకరాల భూమి ఉంది. అదే గ్రామానికి చెదిన సర్పంచ్ కాసాని శ్రీనివాసరావుకు పక్కనే ఎకరం భూమి ఉంది. తమ భూమిలో నుంచి సర్పంచ్ అక్రమంగా దారి కోసం కాలువ తవ్విస్తున్నారని... ఆవేదనతో పురుగుల మందు తాగింది.
చికిత్స కోసం కోదాడ ఆసుపత్రికి తరలించారు. సర్పంచ్‌ను వివరణ కోరగా... వారు చేస్తున్నవి అసత్య ఆరోపణలని తెలిపారు. గతంలో ఉన్న కాలువను వారు ఆక్రమించారని వివరించారు.
ఇదీ చూడండి: భారత సైనికుల దెబ్బకు పరిగెత్తిన చైనా జవాన్లు!