ETV Bharat / jagte-raho

భార్య మరో పెళ్లి చేసుకుందని చంపేశాడు - ap news

తాళి కట్టిన భర్తే ఆ మహిళ పాలిట కాలయముడయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మనస్పర్థలతో విడిపోయారు. మహిళ మరొకరిని పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని మొదటి భర్త ఆమెను కడతేర్చాడు. ఈ ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.

భార్య మరో పెళ్లి చేసుకుందని చంపేశాడు
భార్య మరో పెళ్లి చేసుకుందని చంపేశాడు
author img

By

Published : Dec 18, 2020, 10:51 PM IST

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెం వద్ద వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గణపవరం మండలం మొయ్యేరుకు చెందిన దువ్వాడపు చంద్రిక(32), చిలకపాడుకు చెందిన చంటి ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల... గత ఆరు నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. చంద్రిక గణపవరానికి చెందిన మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది.

ఈ విషయాన్ని తట్టుకోలేని ఆమె మొదటి భర్త ఆమెను చంపేయాలనుకున్నాడు. పథకం ప్రకారం చంటి తన స్నేహితులతో కలిసి పెంటపాడు వస్తున్న చంద్రికను జట్లపాలెంరోడ్డులో అడ్డగించారు. అక్కడ వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

చంద్రిక ఎదురు సమాధానంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చంటి... కత్తితో ఆమె మెడపై వేటు వేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను హతమార్చిన చంటి నేరుగా పెంటపాడు పోలీస్​స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు.

ఇదీ చదవండి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.