మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం రామ్సింగ్తండాకు చెందిన కవిత చెరువులో పడి మృతి చెందింది. ఆమెకు భర్తతో పాటు మూడేళ్ల పాప ఉంది. గ్రామస్థుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కవిత ప్రమాదవశాత్తు పడిందా లేక ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఉపాధి హామీ పెంచి.. ఆ పథకం అమలు చేయండి'