సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారాకుంట శివారులో ఆటోను కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా... ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు జగ్గయ్యపేటకు చెందిన యసవరపు మేరిగా పోలీసులు గుర్తించారు. కోదాడ నుంచి జగ్గయ్యపేటకు ఆటోలో వెళ్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న గుర్తుతెలయని కారు ఢీ కొట్టింది. అనంతగిరి ఎస్సై రామాంజనేయులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆటోను ఢీ కొట్టిన కారు.. ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు - రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఆటోను కారు ఢీ కొట్టిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారాకుంట శివారులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా... ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.