ఏపీలోని తిరుపతి శివారులో పద్మానగర్‌లో ఓ చిన్నారిని వేధించాడంటూ ఆటో డ్రైవర్‌ను మహిళలు చితకబాదారు. ఆరుబయట ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల చిన్నారిని ఆటో డ్రైవర్ మున్నా లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ బంధువులు, స్థానికులు దాడి చేశారు.
స్థానిక మహిళలు అతడిని కింద పడేసి కాళ్లతో తన్నారు. అనంతరం కరెంటు స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనలో ఆ ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఇదీ చదవండి: మొన్న నాగరాజు.. నిన్న ధర్మారెడ్డి.. నిందితుల బలవన్మరణాలు