హైదరాబాద్ ముషిరాబాద్‌లో విషాదం జరిగింది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నాననే మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాంనగర్‌కు చెందిన స్వప్న జైన్ మూడుసార్లు చార్టెడ్ అకౌంట్ పరీక్ష రాసినా ఎంపిక కాలేదు. నాల్గోసారి పరీక్షకు సిద్ధమవుతూ తీవ్ర మానసిక ఒత్తిడికిలోనై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: రోడ్డు దాటుతుండగా వ్యక్తిని ఢీకొట్టిన కారు.. అక్కడికక్కడే మృతి