ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఓ మహిళ పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఓ వ్యక్తి ఆస్తి కాగితాలు తనవద్ద తనఖా పెట్టి అప్పు తీసుకున్నాడని, డబ్బులు చెల్లించకుండానే ఆ ఆస్తిని వేరేవారికి విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది.
భానోత్ సరోజిని అనే మహిళ.. భూక్య బాలాజీ అనే వ్యక్తికి ఆస్తి కాగితాలు తనఖా పెట్టుకుని రెండేళ్ల క్రితం రూ. 4లక్షలు అప్పు ఇచ్చినట్లు పేర్కొంది. ఆ నగదు ఇవ్వకుండానే ఆస్తిని వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేస్తుండగా.. అమె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు చేరుకుంది. తన బాకీ వెంటనే తీర్చాలని.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెట్రోల్ పోసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ ఘటనతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇదీ చూడండి: ఉన్మాది ఘాతుకం.. మహిళపై పెట్రోలు పోసి నిప్పు