ETV Bharat / jagte-raho

కరోనా అనుమానం: ఫ్యానుకు ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య - కరోనా అనుమానంతో మహిళ ఆత్మహత్య వార్తలు

తగు జాగ్రత్తలు తీసుకుంటే.. కరోనా ప్రమాదకరమైనదేమీ కాదని ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. వైరస్‌ సోకితే చావడమే దిక్కన్నట్లు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తమ కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. ఇలాంటిదే ఓ ఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Woman commits suicide by hanging herself to a fan
కరోనా అనుమానం: ఫ్యానుకు ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
author img

By

Published : Aug 11, 2020, 5:43 PM IST

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా షాపూర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కరోనా భయంతో ఎలుగుపల్లి సుజాత అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

సుజాత గత 4 రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు సుజాతకు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించారు. మలేరియా వ్యాధి అని తేలింది.

అయినప్పటికీ సుజాత తనకు కరోనా సోకి ఉంటుందని భయంతో సోమవారం రాత్రి.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.