నిజామాబాద్‌లోని విద్యుత్ నగరానికి చెందిన కృష్ణకు, హారికతో 2001వ సంవత్సరంలో వివాహమైంది. వీరికి నలుగురు సంతానం. కొంతకాలం భార్యతో బాగానే ఉన్న కృష్ణ... రహస్యంగా హరిక చిన్నమ్మ కూతురిని వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఆమె మృతి చెందగా.. రెండు సంవత్సరాల క్రితం హారిక చెల్లెలిని పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో నివాసమున్నాడని హారిక వెల్లడించింది.
ఈ క్రమంలో హారిక చెల్లి కృష్ణతో ఉండేందుకు నిరాకరించిందని.. అప్పటి నుంచి తన భర్త వేదిస్తున్నాడని తెలిపింది. చెల్లిని తీసుకొస్తేనే తప్ప ఇంట్లోకి రానివ్వనంటూ బెదిరిస్తున్నాడని ఆరోపించింది. మహిళా సంఘాల మద్దతుతో హారిక కృష్ణ ఇంటి ముందు ధర్నా చేసింది.
ఇదీ చూడండి: కామారెడ్డి బావామరదళ్ల కథ విషాదాంతం