జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేటకు చెందిన గోపికి మండలంలోని మైతాపూర్ గ్రామానికి చెందిన జలతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు ఉంది. మొదట్లో వీరి కాపురం బాగానే సాగినా.. తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే జల గత ఆరేళ్లుగా పుట్టింటి వద్దే ఉంటుంది.
అప్పటి నుంచి గోపీ జలను కాపురానికి తీసుకెళ్లలేదు. దీనికి తోడు ఇటీవల మరో మహిళను రహస్యంగా పెళ్లిచేసుకున్నాడు. విషయం తెలుసుకున్న జల కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు వెళ్లేది లేదంటూ భీష్మించుకు కూర్చుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి.. కేసు విచారణలో జాప్యం.. పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నం