ETV Bharat / jagte-raho

వేధింపులు తాళలేక భర్తను అంతమొందించిన భార్య - వేధింపులు తాళలేక భర్త హత్య

రోజు మద్యం తాగి వచ్చి వేధిస్తున్న భర్తను భార్య అంతమొందించింది. తలపై రోకలితో మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో జరిగింది.

wife killed husband dandepally mandal in ralla peta village
వేధింపులు తాళలేక భర్తను అంతమొందించిన భార్య
author img

By

Published : Jan 4, 2021, 11:09 PM IST

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో నిత్యం వేధిస్తున్న భర్తను రోకలితో బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.

మద్యానికి బానిసైన బత్తుల రమణయ్య తాగి వచ్చి నిత్యం కుటుంబసభ్యలను వేధింపులకు గురి చేసేవాడు. ఘటనా స్థలాన్ని ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి అశోక్ పరిశీలించారు. భర్త ఆగడాలతో విసుగు చెందిన అతని భార్య కళావతి రోకలితో మోది హత్య చేసినట్లు ఆయన తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: బాలికపై లైంగిక వేధింపుల కేసులో జీవిత ఖైదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.