నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు వరంగల్ గ్రామీణ జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జనాలు అధికంగా ఉండే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, రహదారుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
మద్యం సేవించి ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న పలువురిని బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించి చలానా విధించారు. సోషల్ మీడియా, మీడియా వేదికగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఎంత మొరపెట్టుకున్న వందల సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ఉప్పల్‌లో లారీ బీభత్సం.. ఒకరు మృతి