సైబర్ నేరాల నియంత్రణకు అవసరమైన పరిజ్ఞానాన్ని పోలీసు అధికారులు అందిపుచ్చుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ అన్నారు. ఈ మేరకు హన్మకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఎస్ఐ,ఇన్ స్పెక్టర్, స్థాయి అధికారులకు అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన రోజు శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, వాటిని నియంత్రించడం కోసం పోలీస్ అధికారులకు కూడా సైబర్ నేరాలపై అవగాహన అవసమని సీపీ ప్రమోద్ కుమార్ అన్నారు. సైబర్ నేరగాళ్ళు ఎలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతారు, వారిబారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సి జాగ్రత్తలపై యాక్సెస్ బ్యాంక్ సైబర్ విభాగం నిపుణులు పోలీసులకు వివరించారు.
చక్కటి ప్రతిభ కనబరుస్తోంది
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైం విభాగం ఏర్పాటు అనంతరం సైబర్ నేరగాళ్ళను పట్టుకోవడంలో వరంగల్ కమిషనరేట్ సైబర్ క్రైం విభాగం చక్కటి ప్రతిభ కనబరుస్తోందని సీపీ అన్నారు. రానున్న రోజుల్లో నగరంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఐదుగురు, గ్రామీణ ప్రాంతాల్లోని స్టేషన్లలో ఇద్దరు చొప్పున సైబర్ నేరాలపై అవగాహన కలిగినవారిని నియమిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: ఇప్పటికే కబ్జా అయింది.. ఇంకేం కడతారు?: ఎమ్మెల్యేతో వాగ్వాదం