నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని మజీద్ వెనకాల ఉన్న పురాతన శివాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. నివాసాల సమీపంలో ఉన్న పురాతన దేవాలయంలో ఐదుగురు వ్యక్తులు తవ్వకాలు చేస్తున్నట్లు శబ్దాలను గుర్తుపట్టిన గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చి వారిని పోలీసులకు అప్పగించారు.
మజీద్ వెనకాల ఉన్న ఆలయం నుంచి తవ్వకాలు జరుగుతున్నట్లు శబ్దాలను విన్న గ్రామస్థులు గ్రామపంచాయతీ కార్యదర్శికి సమాచారమిచ్చారు. గ్రామస్థులు దేవాలయాన్ని చుట్టుముట్టి వారిని పట్టుకుని ఎందుకు వచ్చారు అని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం ఇచ్చారని అందుకే పోలీసులకు అప్పజెప్పామని పంచాయతీ కార్యదర్శి వెల్లడించారు.
ఇదీ చూడండి: 'విత్తన కంపెనీలకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం'