ETV Bharat / jagte-raho

నిందితులను శిక్షించాలని రహదారిపై బైఠాయింపు - కామారెడ్డి డీఎస్పీ కార్యాలయం ముందు నిరసన

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం రాంపూర్​లో గట్టు వివాదంలో మృతి చెందిన వ్యక్తి బంధువులు డీఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి, నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

నిందితులను శిక్షించాలని రహదారిపై బైఠాయింపు

author img

By

Published : Jul 12, 2020, 11:40 AM IST

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం రాంపూర్​లో పొలం గట్టు వివాదంలో... శనివారం నాడు దేవెల పోచయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మృతుని బంధువులు డీఎస్పీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. సుమారు గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సీఐ రాజశేఖర్​ అక్కడికి చేరుకొని... న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, ఆందోళన విరమింపజేశారు. దాడికి పాల్పడిన 11 మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్సై శ్వేత తెలిపారు.

ఇదీ చూడండి: మహంకాళి అమ్మవారికి ఆ ఇంటి నుంచి తొలి బోనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.