ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామంలో ఓ వ్యక్తిపై తాను పెంచుకుంటున్న కొండముచ్చు దాడి చేసింది. ఈ ఘటనలో అతని తలకి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటివరకు సరదాగా ఉన్న పెంపుడు జంతువు ఒక్కసారిగా వ్యక్తిపై దాడి చేయడంతో అక్కడ ఉన్న ప్రజలు పరుగులు తీశారు.
గాయాలపాలైన వ్యక్తిని పిడుగురాళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణపాయమేమి లేదని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: ఈ ఏడాదిలో నేరాలు తగ్గాయ్.. మరింత మెరుగుపడ్డాం: డీజీపీ