ఏపీలోని వేదాద్రి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను... ఖమ్మం జిల్లా పెద్ద గోపవరానికి తీసుకువచ్చారు. గ్రామ చుట్టుపక్కల నుంచి జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి నివాళులర్పించారు. ఖమ్మం జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్, రాష్ట్ర విత్తానాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కోటేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి... మృతుల కుటుంబాలను ఓదార్చారు.
ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ప్రమాదంలో మెుత్తం 12 మంది మృతి చెందగా... పెద్ద గోపవరానికి చెందిన ఏడుగురు... జమలాపురానికి చెందిన ఇద్దరు... కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నారు. రెండు గ్రామాలు శోకసంద్రంలో మునిగాయి.
ఇదీ చదవండి: తల్లి ఒడిలో.. దేశ రక్షణలో.. మరిచిపోని జ్ఞాపకాలు