నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట వద్ద ఓ వ్యాన్ సుమారు 50 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వ్యానులో 10 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.
క్షతగాత్రులను పోలీసులు, విద్యుత్ సిబ్బంది వెలికితీశారు. ఇద్దరు చిన్నారులు సహా పెద్దలను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆరుగురికి ఈగలపెంటలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వ్యానులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు పెద్దలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. బాధితులు హైదరాబాద్ దూల్‌పేట్‌కు చెందిన వారిగా గుర్తించారు.
ఇదీ చూడండి: 'తెరాసకే ఓట్లు వేస్తామని అలా ఎలా తీర్మానిస్తారు'