కామారెడ్డి జిల్లా బిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద మల్లారెడ్డి గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఉన్న యుక్తవయస్కుడైనా ఓ వ్యక్తి శవం లభ్యమైంది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు. అయితే అతనే ఉరివేసుకున్నాడా? లేదా ఎవరైనా హత్య చేసి ఉరివేసి ఉంటారా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.
ఇదీ చదవడి: సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్