ఖమ్మం జిల్లా కొనిజర్లకు చెందిన పలువురు మహిళా కూలీలు గ్రామ సమీపంలోని పొలాల్లో వరి నాట్లు వేయడానికి వెళ్లారు. నాటు పూర్తి కాగానే తిపతి రమాదేవి, బండారు మల్లిక, మమత, నాగమణి, మౌనిక అనే ఐదుగురు మహిళలు.. దగ్గరలో ఉన్న వ్యవసాయ బావి వద్ద కాళ్లు కడుక్కునేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. గమనించిన స్థానికులు ముగ్గురిని కాపాడగా.. రమాదేవి, మల్లికలు మృతి చెందారు.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పొలం పనులకని వెళ్లిన మహిళలు విగతజీవులుగా మారడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.