యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి శివారులోని భారత్ పెట్రోల్ బంక్ దగ్గరలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు పనుల కోసం ఆగి ఉన్న ట్రాక్టర్ను... వరంగల్ వైపు వెళ్తున్న టీఎస్ 07 యూ జీ 8638 నెంబర్ గల లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలు, బాధితులను భువనగిరి ప్రాంతీయ ఆసుపత్రికి తలించారు. ఈ ఘనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఒక్కరోజే 10.5 లక్షల కరోనా పరీక్షలు