హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 92లోని ఫెడరల్ బ్యాంకు వద్ద శనివారం రాత్రి రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
బ్యాంకులో విద్యుత్ అంతరాయం ఏర్పడటం వల్ల ఓ ఎలక్ట్రీషియన్, ఆ భవనంలో పని చేస్తున్న వాచ్మెన్ రోడ్డు పక్కన నిల్చుని మరమ్మతులు చేస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపు తప్పి వీరిని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. వాచ్మెన్ నాగర్కర్నూల్ జిల్లా తెల్కపల్లికి చెందిన బి.నగేశ్గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి: మద్యం తయారీ కంపెనీలో ప్రమాదం... నలుగురికి తీవ్ర గాయాలు