నీరు తాగేందుకు వాగులోకి వెళ్లిన రెండు ఎద్దులు ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రామక్రిష్ణాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మేకల లక్ష్మారెడ్డి అనే రైతు... తన రెండు ఎద్దులకు నీరు తాగించేందుకు బండితో సహా వాగులోకి తీసుకెళ్లారు.
ఎద్దులు నీరు తాగేందుకు వెళ్లగా... ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాయి. ఇది గమనించిన రైతు బండి నుంచి పక్కకు దూకాడు. ఈ ప్రమాదంలో రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం అందుకున్న గ్రామస్థులు ఘటన స్థలికి చేరుకున్నారు. మృతి చెందిన ఎద్దులను, బండిని జేసీబీ సాయంతో బయటకు తీశారు.