ETV Bharat / jagte-raho

గుంటూరు రేప్ కేస్: మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు! - rape attempt on engineering student in guntur

ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు ఇంజినీరింగ్ విద్యార్థిని రేప్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కేసుతో సంబంధమున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

గుంటూరు రేప్ కేస్: మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు!

author img

By

Published : Jul 4, 2020, 10:28 PM IST

ఏపీలోని గుంటూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని అసభ్యంగా చిత్రించి, ఆపై అత్యాచారం చేసిన కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే వరుణ్, కౌశిక్​ అరెస్ట్ అయ్యారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

వీరిలో ఒక యువకుడు అసభ్య చిత్రాలను ఇన్​స్టాగ్రామ్​లో అప్​లోడ్​ చేసినట్లు.. మై నేమ్​ ఈజ్ 420 పేరుతో ఖాతా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఖాతా నిర్వాహకుడు తనకు తెలిసిన వారికి ఆ చిత్రాలు పంపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయంలో అతనికి సహకరించిన మరో విద్యార్థిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ వీడియోలు చూపించి విద్యార్థిని నుంచి డబ్బులు కూడా వసూలు చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.

సంబంధిత కథనం:

మూడేళ్లు చిత్రవధ... నగ్న దృశ్యాలతో యువతికి వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.