ETV Bharat / jagte-raho

ఉసురు తీసిన ఆహారం..! కాసుల కోసం ఆస్పత్రి సిబ్బంది బేరం - తెలంగాణ వార్తలు

విషాహారం తిని ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు ఆస్పత్రి పాలయ్యారు. ఆఇద్దరిని కాపాడుకునేందుకు బంధువులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందినకాడల్లా అప్పులు చేసి వైద్యులకు డబ్బులు అందించారు. ఇంతటి తీవ్రమైన దు:ఖంలో ఉన్న వారితో సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రి సిబ్బంది కాసుల బేరానికి దిగారు. మృతదేహాలకు శవపరీక్షలు చేయాలంటే అయిదువేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పుట్టెడు దుఖంలో ఉన్న వారు బతిమిలాడుకున్నారు. అయినా ఆ కఠిన హృదయాలు కరగకపోవటంతో దగ్గరుండి మరీ పోలీసులు నాలుగు వేల రూపాయలకు బేరం కుదిర్చారు.

ఉసురు తీసిన ఆహారం..! కాసుల కోసం ఆస్పత్రి సిబ్బంది బేరం

author img

By

Published : Dec 23, 2020, 4:49 AM IST

ఉసురు తీసిన ఆహారం..! కాసుల కోసం ఆస్పత్రి సిబ్బంది బేరం

కలుషిత ఆహారం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పల్వట్ల గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. జొన్నపిండితో చేసిన రొట్టెలను తిన్న అయిదుగురికి వాంతులయ్యాయి. గమనించిన చుట్టుపక్కల వాళ్లు సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే మఠం చంద్రమౌళి, మఠం సుశీల మరణించారు. ఆ రెండు మృతదేహలను శవాగారంలో భద్రపరిచారు. మఠం శ్రీశైలంను హైదరాబాద్ తీసుకెళ్లగా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరిని వేర్వేరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసుల సాక్షిగా.. లంచాలకు బేరం

అత్యంత బాధాకర సమయాన సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి సిబ్బంది తీరు మరింత వేదనకు గురి చేసింది. ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలకు శవపరీక్షచేసేందుకు సిబ్బంది కాసుల బేరానికి దిగారు. రెండు మృతదేహాలకు కలిపి 5వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ వద్ద అంతలేదని...3,500 రూపాయలు ఇస్తామని బతిమిలాడారు. చాలా కష్టాల్లో ఉన్నామని మృతుల బంధువులు ప్రాధేయపడ్డారు. అయినా సిబ్బంది మనసు కరగలేదు. అడిగిన డబ్బు ఇవ్వకుంటే శవపరీక్ష చేయమలేమంటూ తెగేసి చెప్పారు. ఇదంతా సాక్షాత్తూ పోలీసుల సమక్షంలోనే జరిగింది. చివరకు పోలీసులే ఆస్పత్రి సిబ్బందికి నచ్చజెప్పారు. నాలుగు వేల రూపాయలు తీసుకోవాలని బేరం కుదిర్చారు. మృతుడి అల్లుడు గురువయ్య ఆ మొత్తం వారికి ఇవ్వడంతో శవపరీక్ష మొదలు పెట్టారు. ఈ విషయాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ సంగారెడ్డి దృష్టికి 'ఈటీవీ ప్రతినిధి' తీసుకెళ్లగా... ఆయన బాధితుల నుంచి సిబ్బంది తీసుకున్న మొత్తాన్ని వెనక్కి ఇప్పించారు.

ఆత్మీయులను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది.

ఇదీ చూడండి: ఎంపీ అర్వింద్‌ ర్యాలీలో తల్వార్లతో నృత్యాలు... ఏడుగురిపై కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.