ETV Bharat / jagte-raho

బైక్​లు ఢీకొన్న ఘటనలో మామ, మేనల్లుడు మృతి... ఇద్దరికి గాయాలు - బైక్​ ప్రమాదంలో ఇద్దరు మృతి వార్తలు

ఎదురెదురుగా వస్తున్న బైక్​లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన పటాన్​చెరు మండలంలోని పెద్దకంజర్ల గ్రామంలో చోటు చేసుకుంది.

two-members-died-in-road-accident-in-pedda-kanjerla-village-at-patancheru-mandal
బైక్​లు ఢీకొన్న ఘటనలో మామ, మేనల్లుడు మృతి... ఇద్దరికి గాయాలు
author img

By

Published : Oct 7, 2020, 8:06 PM IST

Updated : Oct 7, 2020, 10:43 PM IST

సంగారెడ్డి జిల్లాలోని పటాన్​చెరు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన రాములు... జిన్నారం గ్రామానికి చెందిన తన మేనల్లుడు కుమార్​తో కలిసి పటాన్​చెరు వైపు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అదే సమయంలో బేగంపేట వైపు నుంచి వినోద్, జగదీశ్ అనే ఇద్దరు యువకులు బైక్​పై ఎదురుగా వస్తున్నారు.

పెద్దకంజర్ల గ్రామ సమీపానికి చేరుకోగానే... ఎదురెదురుగా వస్తున్న వారి బైక్​లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాములు, కుమార్ అక్కడిక్కడే మృతి చెందగా... వినోద్, జగదీశ్​లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మామ, మేనల్లుడు మృతితో... వారి కుటంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఇదీ చూడండి: అదుపుతప్పిన ద్విచక్రవాహనం... ఇద్దరికి తీవ్ర గాయాలు

Last Updated : Oct 7, 2020, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.