ETV Bharat / jagte-raho

మద్యం మత్తులో కారు నడపగా ప్రమాదం.. ఇద్దరు మృతి - రంగారెడ్డి జిల్లా యాక్సిడెంట్ వార్తలు

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఔటర్​ రింగ్​ రోడ్డుపై ప్రమాదం జరిగింది. మద్యం సేవించి వాహనాన్ని నడపగా.. అదపుతప్పిందని పోలీసులు తెలిపారు. ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

two died in an accident while driving car in drunken state at hyderabad orr
మద్యం మత్తులో కారు నడపగా ప్రమాదం.. ఇద్దరు మృతి
author img

By

Published : Oct 9, 2020, 9:51 AM IST

మద్యం మత్తులో వాహనం నడుపుతూ డివైడర్​ను ఢీకొట్టి ఇద్దరు మరణించిన ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి​ పీఎస్​ పరిధిలోని ఓఆర్ఆర్ వద్ద జరిగింది. శంషాబాద్​ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా మార్గమధ్యలో నార్సింగి వద్ద ప్రమాదం జరిగింది. ముందువెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టి.. డివైడర్​ను గుద్దుకుని పల్టీ కొట్టింది.

ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా... మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తులు సూర్యాపేటకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: పతంగి ఎగురవేస్తుండగా.. చిన్నారికి కరెంటు షాక్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.