ETV Bharat / jagte-raho

గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ఏపీలోని చిత్తూరు జిల్లా ముసలిపేడులో విషాదం నెలకొంది. రైతు భరోసా కేంద్రం కోసం తవ్విన పునాది గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇద్దరు పిల్లల ఉసురు తీసిన ఈ రైతు భరోసా కేంద్రం మాకొద్దంటూ గ్రామస్థులు ఆందోళన చేశారు.

death
రైతు భరోసా కేంద్రం పునాది గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
author img

By

Published : Dec 24, 2020, 8:04 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం ముసలిపేడు గ్రామంలో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రం పునాది గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన రాం బత్తయ్య, సుజాత దంపతుల రెండో కుమారుడు బాలు, ఆనంద్, బుజ్జమ్మ దంపతుల రెండో కుమారుడు బాలాజీ ఆడుకుంటూ నీటితో నిండి ఉన్న రైతు భరోసా కేంద్రం పునాది గుంతలో పడ్డారు. ఆ సమయంలో స్థానికులు లేకపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ హఠాత్పరిణామంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు పిల్లల ఉసురు తీసిన ఈ రైతు భరోసా కేంద్రం మాకొద్దంటూ గ్రామస్థులు ఆందోళన చేశారు.

ఇదీచదవండి: తల్లీకుమార్తెలతో సహా మనవరాలు అదృశ్యం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.