ETV Bharat / jagte-raho

రెండు బైకులు ఢీ.. మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం - two bikes collided

రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని పూర్తిగా కాలిపోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో చోటుచేసుకుంది. రెండు వాహనాలు అతివేగంతో అదుపు తప్పి ఒకదానికొకటి ఢీ కొట్టాయి. వాహనదారులకు తీవ్ర గాయాలయ్యాయి.

accident, bhadradri kothagudem
రెండు బైకులు ఢీ, ప్రమాదం, భద్రాద్రి కొత్తగూడెం
author img

By

Published : Jan 13, 2021, 8:52 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం భీముని గుండం కొత్తూరు వద్ద ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు వేగంగా ఢీకొని పూర్తిగా కాలిపోయాయి. వాహనాలపై ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అశ్వాపురం మండలం వెంకటాపురం పంచాయతీ పరిధిలోని పాలవాగుకు చెందిన సందీప్ అనే యువకుడు బైక్​పై అశ్వాపురం వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో బూర్గంపాడు మండలానికి చెందిన భూషణం అనే మరో యువకుడు బూర్గంపాడు వైపుగా వెళ్తున్నాడు. అతివేగంగా వస్తున్న రెండు వాహనాలు అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఒక వాహనానికి చెందిన హ్యాండిల్.. మరో వాహనం పెట్రోల్ ట్యాంక్​కు తగలి ఇంజన్ మీద పడింది. దీంతో రెండు బైకుల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రధాన రహదారిపై బీభత్సంగా కాలిపోతున్న వాటిని చూసిన వాహనదారులు కొంత ఆందోళనకు గురయ్యారు.

ఇదీ చదవండి: ముగిసిన అఖిలప్రియ కస్టడీ.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.