ETV Bharat / jagte-raho

వనస్థలిపురంలో రెండు ఏటీఎంలలో చోరీ

వనస్థలిపురంలోని రెండు ఏటీఎంలోని నగదును గుర్తు తెలియని వ్యక్తులు దోచేశారు. గ్యాస్ వెల్డింగ్ కట్టర్​తో ధ్వంసం చేసి దొరికినంత కాజేశారు. స్థానికంగా ఉన్న సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

two atm theft at vanasthalipuram in hyderabad
వనస్థలిపురంలో రెండు ఏటీఎంలలో చోరీ
author img

By

Published : Nov 16, 2020, 1:37 PM IST

హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలోని సహారా రోడ్​లో ఉన్న రెండు ఏటీఎంలను దుండగులు దోచుకున్నారు. ఎస్‌బీఐ బ్యాంక్​కు చెందిన ఏటీఎంలను గ్యాస్‌ వెల్డింగ్ కట్టర్‌తో ధ్వంసం చేసి అందినకాడికి డబ్బును ఎత్తుకెళ్లారు. ఈ ఏటీఎంలో రూ.9 లక్షలు డిపాజిట్ చేయగా... ఎంత డబ్బు దొంగతనానికి గురైందో సంబంధిత బ్యాంకు అధికారులు తెలియజేయాల్సి ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

వనస్థలిపురంలో రెండు ఏటీఎంలలో చోరీ

వనస్థలిపురం పోలీసులతో పాటు ఎల్‌బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించి... దర్యాప్తు వేగవంతం చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.

ఇదీ చదవండి: కుశ్చితాల లోకంలో బతకలేక.. ప్రేమజంట బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.