టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అసోసియేటెడ్ బ్రాడ్ కాస్ట్ లిమిటెడ్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు తీసుకున్నట్లు అలంద మీడియా ఫిర్యాదు చేసింది. రెండు మూడు సంవత్సరాల్లో సుమారు రూ.100 కోట్ల నగదును తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పూర్తి ఆధారాలు సమర్పించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు రవిప్రకాశ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రవిప్రకాశ్, కేబీఎన్ మూర్తి కలిసి పలు దఫాలుగా ఏబీసీఎల్ నుంచి నగదు తీసుకున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రవిప్రకాశ్ నుంచి సేకరించిన పోలీసులు... ఆయనపై కేసు నమోదు చేశారు. మరికాసేపట్లో రవిప్రకాశ్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది.
పోలీసుల అదుపులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ - tv9 ravi prakash issue
12:31 October 05