ETV Bharat / jagte-raho

లైవ్ వీడియో: తెరాస, భాజపాల బాహాబాహీ.. - జగిత్యాల జిల్లా లేటెస్ట్​ వార్తలు

జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో తెరాస, భాజపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

trs and bjp activists fight each other in jagityala district
ఘర్షణకు దిగిన తెరాస, భాజపా కార్యకర్తలు
author img

By

Published : Dec 30, 2020, 4:43 PM IST

Updated : Dec 30, 2020, 7:26 PM IST

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో తెరాస, భాజపా కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఒకరికిపై మరొకరు దాడికి దిగటంతో ఉద్రిక్తత నెలకొంది. గత నాలుగు రోజులుగా ఫ్లెక్సీల విషయంలో రెండు పార్టీల మధ్య వివాదం కొనసాగుతోంది. తెరాస ఫ్లెక్సీలను అలాగే ఉంచుతూ తమ పార్టీ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని భాజపా నాయకులు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం భాజపా నాయకులు ఆందోళన చేశారు. ఈరోజు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పర్యటన ఉండటంతో భాజపా నాయకులు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమై పోలీసులు వారందరిని అడ్డుకున్నారు. భాజపా నాయకులను అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించగా.. వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పీఎస్​ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు.

ఘర్షణకు దిగిన తెరాస, భాజపా కార్యకర్తలు

ఇదీ చదవండి: కేంద్ర మంత్రులకు మంత్రి కేటీఆర్ లేఖ

Last Updated : Dec 30, 2020, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.