ETV Bharat / jagte-raho

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేసులపై నేడు విచారణ - జగన్ కేసులపై విచారణ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ కోర్టులో నమోదైన కేసులు నేడు విచారణకు రానున్నాయి.హెటిరో, అరబిందోలకు భూకేటాయింపులు, జగతిలో పెట్టుబడులు, పెన్నాఇండియా, దాల్మియా, భారతి సిమెంట్స్‌కు లీజులు, ఇందూగ్రూపు, వాన్‌పిక్‌కు భూకేటాయింపులు తదితరాలపై సీబీఐ నమోదు చేసిన 11 కేసులను విచారిస్తారు.

trial-today-on-jagan-cases
ఏపీః ముఖ్యమంత్రి జగన్ కేసులపై నేడు విచారణ
author img

By

Published : Oct 9, 2020, 7:25 AM IST

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ కోర్టులో నమోదైన కేసులు శుక్రవారం విచారణకు రానున్నాయి. హెటిరో, అరబిందోలకు భూకేటాయింపులు, జగతిలో పెట్టుబడులు, పెన్నాఇండియా, దాల్మియా, భారతి సిమెంట్స్‌కు లీజులు, ఇందూగ్రూపు, వాన్‌పిక్‌కు భూకేటాయింపులు తదితరాలపై సీబీఐ నమోదు చేసిన 11 కేసులను విచారిస్తారు. వీటితోపాటు ఎమ్మార్‌ విల్లాలు, ప్లాట్ల కేటాయింపుపై నమోదైన కేసు, ఓబుళాపురం గనుల లీజు వ్యవహారాలపై నమోదైన కేసులతోపాటు జగన్‌ కేసుల్లో పెట్టుబడుల నిధుల బదలాయింపుల్లో అవకతవకలపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ నమోదు చేసిన 5 కేసులు, ఎమ్మార్‌ వ్యవహారంపై ఈడీ కేసులు శుక్రవారం విచారణకు రానున్నాయి.

హెటిరో కేసు బదిలీకి హైకోర్టును ఆశ్రయించాం

ఈడీ నమోదుచేసిన కేసులన్నీ ఈడీ ప్రత్యేక హోదా ఉన్న సీబీఐ కోర్టులో ఉన్నాయని, హెటిరో భూకేటాయింపు కేసును కూడా దానికి బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసినట్లు జగతి పబ్లికేషన్స్‌ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి గురువారం మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి (ఎంఎస్‌జే), ఈడీ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో హెటిరో, అరబిందోలకు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో భూకేటాయింపులు.. ప్రతిఫలంగా జగన్‌ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారాలపై 2016లో ఈడీ కేసు నమోదు చేసింది. కేసు విచారణ ఈనెల 13న ఉండగా ప్రజాప్రతినిధులపై రోజువారీ విచారణ చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్‌, విజయసాయి తదితరులపై ఉన్న కేసు విచారణ తేదీని మార్చారు. దీనిపై ఎంఎస్‌జే ఎన్‌.తుకారాంజీ విచారించారు.

ఏపీ హైకోర్టు ఇచ్చిన సమాచారం మేరకు న్యాయవాదులతోపాటు నిందితుల జాబితాలో ఉన్న కంపెనీల తరఫు ప్రతినిధులు హాజరయ్యారు. కోర్టు గదిలోకి కేవలం న్యాయవాదులను మాత్రమే అనుమతించారు. హాజరైన నిందితులందరూ కోర్టు గది బయట వేచి ఉన్నారు. కేసును బదిలీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశామని, అది ఈ నెల 20న విచారణకు రానుందని జగన్‌ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసు విచారణను 20కి వాయిదా వేశారు. కేసు బదిలీకి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. కొవిడ్‌ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌లో విచారించాలని న్యాయవాదులు కోరినట్లు సమాచారం.

ఇదీచదవండి 'ఇలా సీబీఐతో విచారణ జరిపించాల్సి వస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.