కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లి వద్ద విషాదం చోటుచేసుకుంది. మానేరువాగులో పడి మహిళ, మూడేళ్ల బాబు మృతి చెందారు. బాబుతో సహా వాగు దాటుతుండగా మానేరు నదిలో మహిళ పడిపోయింది. ఎల్‌ఎండీ నీటిని నిలిపివేసి పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.
పోలీసులు వెతికేలోపు బాలుడు ఆహిల్, అతని పెద్దమ్మ సకీనా ప్రాణాలు కోల్పోయారు. నదిలో నుంచి ఆహిల్, సకీనా మృతదేహాలను పోలీసులు వెలికితీశారు.
ఇవీ చూడండి: ధర్మపురి మండలం నేరెళ్లలో దారుణహత్య