ETV Bharat / jagte-raho

అప్పటిదాకా ఆడి పాడి.. ఒక్కసారిగా అనంతలోకాలకు..

అప్పటివరకు ముద్దుముద్దుగా పాటలు పాడుతూ.. డాన్స్ చేసి తల్లిదండ్రులను, కుటుంబీకులను నవ్వించిన ఆ చిన్నారి అనంతలోకాలకు వెళ్లింది. ఉన్నట్టుండి ఇంట్లో నుంచి రోడ్డుపైకి వెళ్లడం వల్ల ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. కళ్లెదుటే ఆ చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కన్నతల్లితో పాటు కుటుంబీకులు రోదిస్తున్న తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది.

అప్పటిదాకా ఆడి పాడి.. ఒక్కసారిగా అనంతలోకాలకు..
అప్పటిదాకా ఆడి పాడి.. ఒక్కసారిగా అనంతలోకాలకు..
author img

By

Published : Nov 18, 2020, 10:55 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన కుంజా భద్రం.. తన భార్య ఇద్దరు కుమార్తెలతో బుధవారం అశ్వారావుపేట మండలం ముద్దులమడలోని అత్తవారింటికి వెళ్లారు. భద్రం చిన్న కుమార్తె శిరీష (4 ) ముద్దుముద్దుగా పాటలు పాడి.. డాన్స్ చేసి కుటుంబీకులను ఆనందింపజేసింది.

ఉన్నట్టుండి ఒక్కసారిగా రోడ్డు పైకి వెళ్లింది. అప్పటికే గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్న పంచాయతీ ట్రాక్టర్ చిన్నారిని ఢీ కొట్టింది. దీంతో చిన్నారి తలకు బలమైన గాయం కావడం వల్ల ఆ పసికందు అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఈ ఘటనతో ట్రాక్టర్ డ్రైవర్ జెల్లి శ్రీను పారిపోయాడు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే తమ కుమార్తె మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

tractor hit four years girl in bhadradri disrict
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లి చుక్కమ్మ

తల్లి చుక్కమ్మ బాలిక మృతదేహంపై పడి విలపిస్తున్న తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: రోడ్డు పక్కనే ద్విచక్రవాహనం... ఇద్దరు యువకుల దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.