కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామానికి చెందిన మాదిరి రాజయ్య(36) ద్విచక్రవాహనంపై రామారెడ్డి మండల కేంద్రానికి వెళ్లారు. అక్కడ పెట్రోల్ పంపులో ద్విచక్రవాహనంలో పెట్రోల్ పోసుకొని తిరిగి ఇంటికి వస్తున్నారు. రామారెడ్డి వంతెన వద్ద ఇటుక ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
బంధువులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: బోధన్‌లో వీఆర్‌ఏ చెవులు, ముక్కు కోసిన దుండగులు