మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం చిన్నవెళ్లికి చెందిన టిప్పర్ డ్రైవర్ విద్యుదాఘాతం వల్ల అక్కడిక్కడే మృతి చెందాడు. రహదారి పక్కన కల్వర్టు వద్ద నీళ్లు ఉండడం వల్ల టిప్పర్ లారీ ఆపి దుమ్ముపట్టి ఉన్న టిప్పర్ను కడిగి శుభ్రం చేసేందుకు ప్రయత్నించాడు.
టిప్పర్ వెనకవైపున ఉన్న బాడీ లేపడం వల్ల పైన విద్యుత్ తీగలు తగిలి షాక్ వచ్చింది. దీనితో డ్రైవర్ మల్లేశ్ మరణించాడు. మల్లేశ్ మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: 'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదు'