మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఖాజిపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. నర్సింగాపూర్ అడవిలోకి 60 గేదెలను కాపరి మల్లయ్య మేత కోసం తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో హఠాత్తుగా వాటిపై పెద్దపులి దాడి చేసింది. భయంతో కాపరి కేకలు పెట్టాడు. వెంటనే పులి ఒక దానిని వదిలి మరొక జంతువును గాయపరిచి గొల్లవాగు ప్రాజెక్టు వైపు వెళ్లినట్లు కాపరి తెలిపాడు.
ఈ విషయాన్ని వెంటనే ఖాజిపల్లి, నర్సింగాపూర్‌కు చెందిన రైతులకు అతను సమాచారం అందించాడు. తీవ్ర గాయాలతో ఉన్న పశువులను నర్సింగాపూర్‌కు తీసుకు వెళ్లారు. పశువైద్య సిబ్బంది వైద్యం చేస్తుండగా ఒక గేదె అప్పటికే చనిపోయింది. మరొకటి తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది.
ఇదీ చదవండి: వారం వారం వంటింటి మంట..