భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం సమీపంలో పులి సంచారం కలకలం సృష్టించింది. వైల్డ్‌లైఫ్ పరిధిలోని గుండ్లమడుగు అటవీ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి పులి సంచరించినట్లు గ్రామస్థులు తెలిపారు.
సోమవారం తెల్లవారుజామున ఆవుదూడపై పులి దాడి చేసిందని, తాము కేకలు వేయడం వల్ల దూడను వదిలి పారిపోయిందని రాత్రి కాపలాకు వెళ్లిన రైతులు వెల్లడించారు. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. పులిదాడిలో ఆవుదూడ స్వల్పంగా గాయపడినట్లు గుర్తించారు.