ETV Bharat / jagte-raho

చెట్టును ఢీకొన్న బైక్.. ముగ్గురు యువకులు మృతి

author img

By

Published : Jan 13, 2021, 9:15 PM IST

సరదాగా డ్యాం అందాలను చూసేందుకు బైక్​పై బయలుదేరారు. అయితే అతివేగం వారి పాలిట శాపమైంది. అదుపుతప్పిన ద్విచక్రవాహనం చెట్టును ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్​ మండలం సింగూరు డ్యాం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది.

three youngsters died in bike accident sangareddy dist near singur dam
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి

ద్విచక్రవాహనం చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గరు యువకులు మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు డ్యాం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ద్విచక్రవాహనం రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. మృతులు మెదక్​ పట్టణానికి చెందిన సమీర్, జమీర్, సోఫీగా గుర్తించారు.

ప్రమాదం జరిగిందిలా :

మంగళవారం ముగ్గురు యువకులు సింగూర్ డ్యాం చూసేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. వారి వాహనం సింగూరును ప్రాజెక్ట్ సమీపానికి చేరుకోగానే అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనంలో యువకులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సమీర్, సోఫీ మృతి చెందారు. మరో యువకుడు జమీర్​ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. మృతుల్లో సమీర్, జమీర్ అన్నదమ్ములు కాగా.. సోఫీక్​ వారికి బావ అవుతాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు.

ఇదీ చూడండి : జనగామ లాఠీఛార్జీ ఘటనపై విచారణకు వరంగల్​ సీపీ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.