ETV Bharat / jagte-raho

రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని మూడేళ్ల బాలుడు మృతి - lorry hits a boy in nalgonda

రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు వద్ద చోటుచేసుకుంది. పారిపోవడానికి ప్రయత్నించిన లారీ డ్రైవర్​ను స్థానికులు పట్టుకున్నారు.

three  years old boy died in an accident
నల్గొండ రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
author img

By

Published : Oct 5, 2020, 2:03 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామానికి చెందిన మధు, చిట్టెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. మధు లారీ డ్రైవర్​గా పనిచేస్తుండగా.. చిట్టెమ్మ కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఉదయం చిట్టెమ్మతో వచ్చిన పిల్లలిద్దరు రోడ్డు దాటే క్రమంలో.. చిన్న కుమారుడు మణిశర్మను లారీ ఢీకొట్టింది.

ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం చేసి పారిపోతున్న లారీ డ్రైవర్​ను స్థానికులు అడ్డగించి పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మూడేళ్ల బాలుడు మణిశర్మను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కళ్లముందే తన కన్నకొడుకు విగతజీవిగా మారడం చూసి ఆ తల్లి రోదనలు మిన్నంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.