యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలోని ఆస్టర్ కెమికల్ కంపెనీ నుంచి ఒక్కసారిగా విషవాయువులు బయటకు వెదజల్లాయి. పక్కనే ఉన్న పరిశ్రమలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు విషపుగాలిని పీల్చి అస్వస్థతకు గురయ్యారు. గమనించిన తోటి కార్మికులు వారిని ఆసుపత్రికి తరలించారు.
ఎలాంటి అనుమతులు లేకుండా సాగుతున్న ఆస్టరా కంపెనీని మూసివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ కంపెనీలు వెదజల్లే విషవాయువులతో తాము అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.