ETV Bharat / jagte-raho

రెండురోజుల క్రితం అదృశ్యం.. వాగులో శవం - బాలానగర్​లో శవమైన తేలిన పదమూడేళ్ల బాలుడు

కుమారుడి రాక కోసం వేయికళ్లతో ఎదురుచూసిన ఆ తల్లి ఆశలను నీళ్లు మింగేశాయి. తిరిగి వస్తాడనుకున్న కన్నకొడుకు తిరిగిరాని లోకాలకు చేరాడు. రెండురోజుల క్రితం అదృశ్యమైన పదమూడేళ్ల బాలుడు వాగులో శవమై తేలాడు. మహబూబ్​నగర్ జిల్లా బాలానగర్ మండలకేంద్రంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.

boy died in canal in balanagar
ఈతకు వెళ్లి మృతి చెందిన బాలుడు
author img

By

Published : Jan 10, 2021, 4:27 PM IST

మహబూబ్​నగర్ జిల్లా​ బాలానగర్​ మండలంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు శ్రీకాంత్​(13) వాగులో శవమై కనిపించాడు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు విగతజీవిగా మారాడు. శుక్రవారం తన కుమారుడు కనిపించడం లేదంటూ కమలమ్మ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ, పోలీసు అధికారులకు దుందుభి వాగు వద్ద బాలుని చెప్పులు, దుస్తులు కనిపించగా.. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు తెల్లవారుజామున బాలుని మృతదేహం లభ్యమైంది. ఈతకు వెళ్లి చెక్​ డ్యాం వద్ద గల్లంతైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : జేబుదొంగ దారుణ హత్య... మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.