హైదరాబాద్ గోల్కొండలో తరచు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను గురువారం పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఒకరు మేజర్ కాగా.. మరో ఇద్దరు మైనర్లు. జతిన్(19), మరో ఇద్దరు మైనర్ స్నేహితులు కలిసి తరచుగా దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు.
బుధవారం నాడు గోల్కొండ పీఎస్ పరిధిలో పాన్ డబ్బా వద్ద దొంగతనానికి యత్నిస్తుండగా.. పోలీసులకు అనుమానం వచ్చి వారిని ప్రశ్నించారు. దొంగతనానికి వచ్చినట్లు వారు తెలుపగా.. గుట్టురట్టయింది. పోలీసులు వీరి నుంచి సుమారు రూ. 2.3 లక్షల విలువైన సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రెండు ద్విచక్రవాహనాలను జప్తు చేశారు.
ఇదీ చూడండి:- యూనిఫామ్‌కు మ్యాచింగ్ మాస్కులు తప్పనిసరి..!