ETV Bharat / jagte-raho

మత్తుకు బానిసై ద్విచక్రవాహనాల చోరీ - bike thief arrested by task force police

మొదట టీ అమ్ముతూ జీవనం సాగించేవాడు. తర్వాత స్నేహితులతో కలిసి గంజాయికి అలవాటుపడ్డాడు. టీ అమ్మితే వచ్చే డబ్బులు సరిపోక బైకుల చోరీకి తెరతీశాడు. లంగర్​హౌజ్​ పీఎస్​ పరిధిలో ద్విచక్రవాహనాలు దొంగిలించి ఆఖరికి పోలీసులకు చిక్కాడు.

Theft of motorcycles  intoxicated for alcohol  in lunger house hyderabad
మత్తుకు బానిసై ద్విచక్రవాహనాల చోరీ
author img

By

Published : Dec 8, 2020, 8:49 PM IST

హైదరాబాద్​లోని లంగర్​హౌజ్​ పరిధిలో ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న దొంగను వెస్ట్​జోన్​ కార్యదళం పోలీసులు పట్టుకున్నారు. నాలానగర్​ వద్ద టీ స్టాల్​ నిర్వహించే మహమ్మద్​ ఖాన్(20) ఈ చోరీలకు పాల్పడ్డాడు.

లంగర్​హౌజ్​లోని తన స్నేహితులతో కలిసి గంజాయి సేవించేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై డబ్బులు సరిపోక బైకుల దొంగతనానికి పాల్పడ్డాడు. నిర్మానుష్య ప్రదేశాల్లో నిలిపిన వాహనాలే లక్ష్యంగా చోరీలు చేసేవాడు. సమాచారం అందుకున్న కార్యదళం పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లంగర్​హౌజ్​ ఠాణాలో అప్పగించి, రిమాండుకు తరలించారు.

ఇదీ చూడండి: తెలంగాణ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.