యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో ఘరానా చోరీ జరిగింది. బుధవారం రాత్రి తాళాలు పగలగొట్టిన దుండగులు రెండిళ్లలోని బంగారు, వెండి, నగదు, ఆస్తి పత్రాలు ఎత్తుకెళ్లారు. తాళాలు పగలగొట్టి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు, యజమానులకు సమాచారం అందించారు.
గ్రామానికి చెందిన అన్నదమ్ములు గుర్ర రంజిత్, సతీశ్ జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. గుర్ర రంజిత్ ఇంట్లో రెండున్నర తులాల బంగారు, 20 తులాల వెండి, భూమి పత్రాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. సతీశ్ ఇంట్లో మూడు తులాలకు పైగా బంగారు, ఆరువేల నగదును అపహరణకు గురైనట్లు బాధితులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపారు.